Janasena:ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ సమన్వయకర్త బీవీ రావు రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నానని.. 2019లో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఇచ్చారని అప్పుడు 11 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అప్పటి నుండి జనసేనలో క్రియాశీలకగా పనిచేస్తూ ఉన్నానని ఆయన అన్నారు.
Also Read: పిఠాపురంలో జనసేనాని గృహప్రవేశం..
బురద జల్లుతున్నారు
పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిపి కైకలూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనుకి టిక్కెట్ ఇచ్చారన్నారు. అయితే వారు టీడీపీని కలుపుకొని పోతున్నారే తప్ప జనసేనలో ఉన్న చిల్లర బ్యాచిని వేసుకొని తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని కైకలూరు నియోజకవర్గంలో నేలమట్టం చేయాలని ఉద్దేశంలో కామినేని శ్రీనివాస్ ఉన్నారని ఆరోపించారు. తాను బిసి యాదవ కులానికి చెందిన వాడినేనైనా పార్టీ కొరకు స్థోమతి మించి ఖర్చుపెట్టి పార్టీకి సేవలు చేస్తే మిగిలింది ఏమీ లేదని వాపోయారు.
త్వరలోనే
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది పేదలు కొరకు అయితే ఇక్కడ బీజేపీ వ్యక్తి ఎస్సీలను బీసీలను వాడుకొని వదిలేయటం తప్ప ఏమీ ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుస్తారని ఇప్పటి వరకు వేచి చూసిన పిలవలేదని వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పిలిచి మాట్లాడినారని బీజేపీ అభ్యర్థితో కలుపుకుని పోవాలని సూచించారన్నారు. కానీ క్రింది స్థాయిలో జనసేన నాయకులను మాత్రం బీజేపీ అభ్యర్థి తొక్కుతున్నారని అన్నారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు