Gudiwada: నటుడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ

గుడివాడలో నటుడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని కైకాల కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

New Update
Gudiwada: నటుడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ

 Actor Kaikala Satyanarayana Bronze Statue: గుడివాడ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. కైకాల కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలతో నివాళుల్పించారు. ఒక వ్యక్తిగా గుడివాడలో ప్రస్థానం ప్రారంభించిన కైకాల సత్యనారాయణ, 8వందల చిత్రాల్లో నటించి లెజెండ్ గా ఎదిగారని కొనియాడారు ఎమ్మెల్యే కొడాలి నాని.నాడు చంద్రబాబు సూచనలతో పార్లమెంట్ సభ్యుడిగా పోటిచేయమని ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, కైకాలను కోరిన వారిలో తాను ఉన్నానని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా కైకాల గెలవడమే కాక, తన ప్రభావంతో ఏలూరు, తెనాలి పార్లమెంట్ సభ్యులను కూడా గెలిపించిన సత్తా కైకాలదని నాటి విషయాలను ఎమ్మెల్యే నాని గుర్తు చేసుకున్నారు.

Also Read: జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!

సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అజాతశత్రువైన కైకాల జీవితం ఆదర్శప్రాయమని ఎంపీ వల్లభనేని బాలశౌరి కీర్తించారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, కళా రంగంలో ఓనమాలు నేర్చుకున్న గుడివాడలో కైకాల విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన సోదరుడు సినీ నిర్మాత కైకాల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నాని, ఎంపీ బాలశౌరి సత్కరించారు.

అనంతరం కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కైకాల వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. విగ్రహవిష్కరణ వేడుకల్లో కైకాల బార్య నాగేశ్వరమ్మ, కుమారులు లక్ష్మీ నారాయణ, వెంటరామారావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కాపు సేవా సమితి అధ్యక్షుడు నల్లగంచు వెంకట రాంబాబు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పాలేటి చంటి, కైకాల కుటుంబ సభ్యులు, కళా కారులు,  కైకాల అభిమానులు, కాపు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు