AP: ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం.. పోలీసులు తన భర్తను..

తనకు గన్‌మెన్లు వద్దని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసులు రెడ్డికి 2+2 గన్‌మెన్లు కేటాయించారు. తాజాగా తన భర్తకు గన్‌మెన్లను తొలగించడంతో ఆమె మనస్థాపం చెంది తన గన్‌మెన్లను వెనక్కి పంపారు.

New Update
AP: ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం.. పోలీసులు తన భర్తను..

Kadapa: తనకు గన్‌మెన్లు వద్దని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని కోరారు మాధవిరెడ్డి. దీంతో మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసులు రెడ్డికి 2+2 గన్‌మెన్లు కేటాయించారు. తాజాగా తన భర్తకు గన్‌మెన్లను తొలగించడంతో ఆమె మనస్థాపం చెందారు. పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

తన గన్‌మెన్లను తిరిగి వెనక్కి పంపారు. తనకు సెక్కూరిటీ అవసరం లేదన్నారు. గన్‌మెన్లు లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనకు కనీస సమాచారం లేకుండానే 2+2గా ఉన్న గన్‌మెన్లను 1+1కు కుదిరించారని.. తన భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డికి సెక్యూరిటీ తొలగించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన సెక్కూరిటీని తిరిగి వెనక్కి పంపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు