మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను కడపలోని సిద్ధివినాయక స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నేను కోరుకున్నది ఆయన చేశాడు. అందుకే మొక్కు తీర్చాను. మంచిగా ఉన్న చంద్రబాబు అరెస్టు అయినా వినాయకుని ఆశీస్సులతో బయటకు వస్తాడని ఆశిస్తున్నాను. చంద్రబాబు, నా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాని ఆయన అన్నారు. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని వైసీపీ నన్ను సస్పెండ్ చేసింది.. త్వరలో టీడీపీలో చేరుతా.. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఈ పాటికి పార్టీలో చేరేవాడిని.. తేదీ ఖరారు చేయమని అడిగాను ఇవ్వగానే నేను పార్టీలో అధికారికంగా చేరుతా చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా నా గ్రాఫ్ బాగోలేదని.. సీఎం జగన్ ముఖాన్నే చెప్పాడు. నేను తప్ప ఉదయగిరిలో ఎవరూ గెలవరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.చం ద్రబాబు టికెట్ ఇస్తే మరోసారి గెలుస్తా ఇవ్వకపోయినా టీడీపీలోనే కొనసాగుతా అన్నారు.
వైసీపీ కోసం త్యాగం చేసిన
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మేధావులు, పిల్లలు, చదువుకున్న వారు అన్ని వర్గాలు అర్థం చేసుకున్నారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం ప్రకారం జరగడంలేదని వారికి అర్థమైంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే న్యాయం, ధర్మం జరగుతుందని ప్రజల కోరికగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రజల కోరిక, ఉద్యోగస్తుల కోరిక కూడా తీరుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. వైసీపీ కోసం త్యాగం చేసిన వాళ్లము కూడా హ్యాపీగా ఉంటామన్నారు. జగన్ కోసం అధికారాన్ని కూడా కాదని రాజీనామా చేసి వచ్చిన వాడిని కానీ నేడు జగన్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అది థర్మమో, న్యాయమో ఆ భగవంతుడికే తెలుసు అన్నారు.
మంచి దెబ్బ కొట్టారు
ఉదయగిరి నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే అని వ్యక్తి ఎవరూ లేరు నేనొక్కడినే.. మళ్ళీ టికెట్ ఇవ్వమని నాలుగైదు సార్లు అడిగాను. నా గ్రాఫ్ బాగోలేదు, నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తారని జగన్ తెగేసి చెప్పాడు. వైఎస్ఆర్ పార్టీ కోసం ఆది నుంచి శ్రమపడ్డాను..నేను ఆశపడే వాడేవాడిని కాదు. లంచాలు తీసుకుని జేబులు నింపుకునే వాడిని కాదు. సోషలిస్టు మనిషిని అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను అన్నారు. రాజశేఖర్‌రెడ్డికి చాలా ఇష్టమైన వాడిని కానీ జగన్ వల్ల అవన్నీ పటాపంచలయ్యాయి. కాంగ్రెస్ కాదని వచ్చినందుకు నాకు ఇక్కడ మంచి దెబ్బ కొట్టారు. నాకు ఎలాంటి కోరికలు లేవు. నన్ను ఇంకేమి ఇబ్బంది పెడతారు. నాలాంటి వ్యక్తికి ఇలా అన్యాయం జరగకూడదు.. ఆ వినాయకుడే ఆశిస్సులు అందిస్తాడని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ పేర్కొన్నారు.