Rajareddy murder: హత్య చేసింది కుటుంబసభ్యులే..రీ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్, డాడీ హోం నిర్వాహకుడు రాజారెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజారెడ్డిని హత్య చేసింది తమ్ముడు, మరదలేనని పోలీసులు తేల్చారు. కిరాయి హంతలకులతో కలిసి రాజారెడ్డి మర్డర్‌కు పథకం వేసినట్టు నిర్థారించారు.

Rajareddy murder: హత్య చేసింది కుటుంబసభ్యులే..రీ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు
New Update

Daddy foundation rajareddy murder case: డాడీ రాజారెడ్డి రీ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజారెడ్డిని హత్య చేసింది కుటుంబసభ్యులేనని నిర్థారణయింది. సోదరుడు శ్రీధర్‌రెడ్డి, మరదలు ప్రసన్న, డాక్టర్ వీరేంద్రనాథ్ రెడ్డి, కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మీడియా సమావేశంలో ఏఎస్పీ ప్రేరణా కుమార్ వివరాలు తెలిపారు. ట్రస్ట్‌ ఆస్తులను అనాధల పేరిట పెట్టడాన్ని జీర్ణించుకోలేక రాజారెడ్డి హత్యకు పథకం పన్నినట్టు చెప్పారు ఏఎస్పీ. హత్యకు రెండ్రోజుల క్రితమే ప్రసన్నను డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించిరన్నారు. అనాధ బిడ్డ కవితను డైరెక్టర్‌గా నియమించారు రాజారెడ్డి. కోట్ల ఆస్తిని అనాధలకివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాజారెడ్డితో తమ్ముడు, మరదలు గొడవకు దిగారు. కిరాయి హంతకులతో కలిసి రాజారెడ్డి హత్యకు ప్లాన్‌ చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి, కరెంట్‌ తీసేశారు హంతకులు.



యాక్టింగ్‌ చేశారు:

పూజా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రాజారెడ్డి హత్య జరిగింది. రాజారెడ్డిపై కిరాయి హంతకులు దాడి చేశారు. రాజారెడ్డి కిందపడగానే గొంతు నులిమి చంపేశారు. తమకేమీ తెలియనట్టు అమాయకుల్లా డ్రామా ఆడారు కుటుంబసభ్యులు. సహజ మరణంగా తప్పుడు నివేదిక ఇచ్చారు ప్రసన్న బంధువు డాక్టర్‌ వీరేంద్రనాథ్‌ రెడ్డి. ఇక డాడీ హోమ్‌లో రాజారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. రాజారెడ్డి ఒంటిపై గాయాలుండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వైద్య నిపుణులతో రీపోస్ట్ మార్టం చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఎలా బయటపడిందంటే ?

నిందితులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలతో మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించడంతో ఈ నిజాలు బయటపడ్డాయి. గొంతునులుమి, ఊపిరాడకుండా చేయడం వల్లే రాజారెడ్డి మరణించారని రీపోస్ట్‌మార్టంలో తేలింది. శ్రీధర్‌రెడ్డి, అతని భార్య లక్ష్మిప్రసన్నలు రాజారెడ్డి హత్యకు 10 రోజులు క్రితమే కుట్ర చేశారని తేలింది. రాజారెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య ప్రసన్న, వారికి సహకరించిన మరో ఇద్దరు కిరాయి వ్యక్తులు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. చివరకు పథకం ప్రకారం 11వ తేదీ రాత్రి రాజారెడ్డిని సోదరడుఉ శ్రీధర్‌రెడ్డి, శివ, సుభాన్‌ అనే వ్యక్తులతో కలిసి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe