/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Sharmila-Case-jpg.webp)
ఏపీపీసీసీ చీఫ్ షర్మిలపై కడప జిల్లా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న బద్వేల్లో జరిగిన బహిరంగ సభలో వివేక హత్య గురించి షర్మిల ప్రస్థావించారు. వివేక హత్య గురించి ఎన్నికల్లో ఎవరూ ప్రస్తావించకూడదని ఇటీవల కడప కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ.. షర్మిల వివేకా హత్య గురించి ప్రస్తావించడంతో బద్వేల్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుకు స్పందించిన బద్వేల్ పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.