KA Paul: సచివాలయం ఎదుట కేఏ పాల్ నిరసన

ఏపీ సచివాలయం ఎదుట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన చేపట్టారు. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై ఆందోళన చేశారు.

KA Paul: సచివాలయం ఎదుట కేఏ పాల్ నిరసన
New Update

KA Paul: తెలంగాణ ఎన్నికల్లో హాడావీడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద నిరసనకు దిగారు కేఏ పాల్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి వచ్చినట్లు తెలిపారు. అయితే, ఆయనకు అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. కాసేపు తర్వాత లోపలికి అనుమతించారు. కానీ, సీఈవో ముఖేశ్‌ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ లో ఉండడంతో కలవలేరని చెప్పారు. దీంతో ఐదో బ్లాక్ ఎంట్రన్స్ వద్ద మెట్లపై కూర్చుని నిరసనకు దిగారు. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై కేఏ పాల్ ఆందోళన చేశారు.

Also Read: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..!

కాగా, గ్లోబల్ పీస్ మేకర్ గా కేఏ పాల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా చిట్టివలస గ్రామంలో జన్మించారు. మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ కు అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. క్రిస్టియనీటి స్వీకరించిన కే పాల్ ఆ తరువాత దేశ విదేశాల అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకుర్చుకునేవాడు. అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారంటూ ఆయన గురించి చెబుతారు. ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా చదువు, ఆరోగ్య సేవలు అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసారు. ప్రజాశాంతి పార్టీ (Prajasanthi Party) పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు.

#ka-paul
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe