KA Paul: ఐ ప్యాక్ సర్వే ఇదే చెప్పింది.. పిఠాపురంలో పవన్ పరిస్థితిపై KA పాల్ ఎక్స్ క్లూజివ్.!

విశాఖ ఎంపీగా తన గెలుపును ఎవరు ఆపలేరన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారన్నారు. కూటమి తరుపున భరత్, వైసీపీ నుండి బొత్స ఝాన్సీ ఇద్దరు తనతో పోటీ పడలేకపోయారని పేర్కొన్నారు.

New Update
KA Paul: ఐ ప్యాక్ సర్వే ఇదే చెప్పింది.. పిఠాపురంలో పవన్ పరిస్థితిపై KA పాల్ ఎక్స్ క్లూజివ్.!

KA Paul: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి KA పాల్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. విశాఖ ఎంపీగా తన గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడన్నారు. రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారు అనేది బిలియన్ డాలర్ల లాంటి సందేహమని పేర్కొన్నారు. కూటమి తరుపున భరత్, వైసీపీ నుండి బొత్స ఝాన్సీ ఇద్దరు తనతో పోటీ పడలేక పోయారని కామెంట్స్ చేశారు. ఐ ప్యాక్ సర్వే పాల్ గెలుస్తుందని చెప్పిందని.. 1.5 - 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని పేర్కోన్నారు.

Also Read: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట.!

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరోసారి మోదీ ప్రధాని కానున్నారన్నారు. ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానని తెలిపారు.  నాల్గవ ఫెజ్ లో ఎన్నికలు జరగడానికి కారణం తానేనని పేర్కొన్నారు. కాపులు, క్రిస్టియన్లు, బీసీలు, నిరుద్యోగులు, తనకు మద్దత్తు తెలిపారని..ఈసారి ఏపీలో చాలా వరస్ట్ గా ఎన్నికలు జరిగాయని వెల్లడించారు.

Also Read: వికీపీడియాలో పిఠాపురం రిజల్ట్స్.. గెలుపుపై సోషల్‌ మీడియాలో వార్‌.. !

ఎలక్షన్ కమిషన్ నిబంధనలను తుంగలోకి తొక్కారని..వేల కోట్ల పంపకాలు జరిగాయని ఆరోపించారు. విశాఖలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతా లోపాలు ఉన్నాయని.. సిసి టివి యాక్సస్, లైవ్ లింక్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆర్ఓ సహా ఎన్నికల సిబ్బంది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు