Jyotika Sri Dandi: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పేదింటి బిడ్డ దండి జ్యోతిక శ్రీ ఒలింపిక్ (Olympic) క్రీడలకు ఎంపికైంది. 13వ ఏట నుంచి పరుగు పందెంలో రాణిస్తున్న జ్యోతిక పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. తాజాగా, ప్యారిస్ లో జరగబోయే ఒలింపిక్ క్రీడలకు జ్యోతిక శ్రీ అర్హత సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!
జ్యోతిక శ్రీ తండ్రి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఇనుప బీరువాలు తయారీ చేస్తారు. ఆయన మాట్లాడుతూ.. తాను చదువుకున్న రోజుల్లో బాడీ బిల్డింగ్ లో ప్రతిభ కనబరచినట్లు తెలిపాడు. తనకు మగ సంతానం కలిగితే ఒలింపిక్ క్రీడలకు తయారు చేద్దమని అనుకున్నానని.. అయితే, ఇద్దరు ఆడ బిడ్డలే పుట్టడంతో మొదట్లో బాధపడ్డానని తెలిపారు
Also Read: చట్నీలో ఎలుక.. కాలేజీ ప్రిన్సిపల్ క్లారిటీ..!
అయితే, తన కూతురు క్రీడలపై మక్కువగా ఉండటం గమనించి 13వ ఏట నుంచే తర్ఫీదు ఇప్పించానన్నారు. తన కూతురు జ్యోతిక శ్రీ ఇతర రాష్ట్రాల్లో పోటీలకు వెళ్ళాలంటే అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డామన్నారు. జనరల్ బోగీల్లో ఖాళీ లేక రిజర్వేషన్ భోగి ఎక్కితే తమను అనేక సార్లు ట్రైన్ దించేసిన ఘటనలు వున్నాయని జ్యోతిక శ్రీ తండ్రి శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.