Hyderabad : ప్రతిరోజు సమయాన్ని తెలిపే గడియారం చూడడానికి బాగుంటే… ఆ గడియారం(Clock) తమకే అందాన్ని పెంచుతుంది. అయితే చేతికి ఖరీదైన వాచ్ పెట్టుకుంటే స్టేటస్ పెరుగుతుందన్న ఆలోచనలో ఉంటారు. అలాంటి వారి కోసం ఒక శుభవార్త… అది ఏంటి అని ఆలోచిస్తున్నారా..?.. హైదరాబాదులోని సోమాజిగూడలో అన్లిమిటెడ్ గాడ్జెట్స్(Unlimited Gadgets) అనే స్టోర్ లో ఎంతో ఖరీదైన వాచ్లను చాలా తక్కువ ధరలో కస్టమర్లకు అందిస్తున్నారు. ఈ స్టోర్ లో ఉన్న వాచ్ లను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఈ స్టోర్ లో చాలా అంతర్జాతీయ వాచ్ ల బ్రాండ్లు(International Watch Brands) ఉన్నాయి. ప్రతి ఒక్క సామాన్యుడి చేతికి ఖరీదైన వాచ్ ఉండాలన్న ఆలోచనతో ఈ స్టోర్ లో అనేక రకాల విలువైన వాచ్లను కస్టమర్ల కోసం చాలా తక్కువ ధరలు ఏర్పాటు చేశారు. ఈ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ లో లభించే బ్రాండెడ్ వాసులకు ఎంతో డిమాండ్ ఉంది అని అన్లిమిటెడ్ గాడ్జెట్స్ యజమాని దేవ్ తెలిపారు.
ప్రతివారం వచ్చే బ్రాండెడ్ వాచ్ స్టాక్ చాలా తక్కువ రోజుల్లో స్టాక్ అయిపోతుందని తెలిపారు. అంతేకాకుండా కస్టమర్ల కోసం ప్రతివారం కొత్త బ్రాండెడ్ వాచ్ స్టాక్ ఏర్పాటు చేస్తామని వివరించారు. అయితే ఈ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ స్టోర్ లో జి షాక్, టిసార్ట్, ట్యాగ్ హుఆర్, రోలెక్స్ బ్రాండ్(Rolex Brand) లో అనేక రకాల వాచ్లు లభిస్తున్నాయి. ఇందులో జి షాక్ వాచ్ లు కేవలం 999 రూపాయలకే లభిస్తున్నాయి. జి షాక్ బ్రాండ్ లో రెయిన్బో వాచ్ చూడడానికి చాలా బాగుంటుంది. దీని ధర కేవలం 1200 రూపాయలు మాత్రమే. ఈ వాచ్ లతో పాటు ఒరిజినల్ బాక్స్ కూడా ఇస్తున్నారు.
అంతేకాకుండా టిసార్ట్, ట్యాగ్ హుఆర్ ఏ వన్ క్వాలిటీ వాచ్ లు కేవలం 2500 రూపాయలకే ఇస్తున్నారు. ఈ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ స్టోర్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే ఖరీదైన వాచ్ లభిస్తుంది. ఆ వాచ్ బ్రాండ్ వింటేనే చాలు చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇప్పుడున్న యువతకి ఆ వాచ్ ని ధరించాలన్న కోరిక ఉంటుంది. ఇతర మార్కెట్లో ఈ వాచ్ ధర లక్షల్లో ఉంటుంది కానీ ఈ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ స్టోర్ లో కేవలం 4500 రూపాయలకే కస్టమర్లకు దొరకడం ఎంతో అదృష్టం అని భావిస్తున్నారు.
ఆ వాచ్ ఏంటి అంటే రోలెక్స్. అవునండి మీరు విన్నది నిజమే ఈ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ స్టోర్ లో రోలెక్స్ వాచ్ అతి తక్కువ ధరలో లభించడం విశేషం. ఇలాంటి అంతర్జాతీయ బ్రాండెడ్ వాచ్ లు ఇంకా ఎన్నో ఉన్నాయని.. అంతేకాకుండా ప్రతి వారం కస్టమర్ల కోసం మంచి స్టాక్ ఏర్పాటు చేస్తున్నామని అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ స్టోర్ యజమాని దేవ్ తెలిపారు.