Business Ideas: తక్కువ పెట్టుబడితో మంచి లాభం వచ్చే బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడి(Low investment) తోనే ప్రతినెల మంచి రాబడి పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా మీరు స్వయం ఉపాధి కూడా పొందుతారు. అతి తక్కువ ప్రారంభించే ఈ బిజినెస్ ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఆయిల్ వాడకం ప్రస్తుతం మార్కెట్లో చాలా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రిఫైండ్ ఆయిల్ కన్నా కూడా ఆర్గానిక్ ఆయిల్స్ వాడేందుకే జనం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. దీనికి కారణం ప్రస్తుత మార్కెట్లోని రిఫండ్ ఆయిల్స్(Refund Oils) లో రసాయనాలు కలుపుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహజసిద్ధంగా గానుగ నుంచి తీసే కోల్డ్ ప్రెస్ వాడమని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఆర్గానిక్ ఆయిల్ వ్యాపారం (Organic Oil Business)చేసినట్లయితే చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు కంప్లీట్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోండి.
కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషిన్ కొనుగోలు:
ఆర్గానిక్ ఆయిల్ బిజినెస్ కోసం మీరు ముందుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర మార్కెట్లో రూ. 30000 నుంచి రూ.10 లక్షల రూపాయల వరకు ఉంది. అయితే ఈ మిషిన్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. కనీసం 50 వేల రూపాయల మిషన్ అయినట్లయితే ఒక మధ్య తరహా ఆయిల్ మిల్ స్థాపించుకోవచ్చు. మీరు కోల్డ్ ప్లస్ ఆయిల్ షాపు పెట్టాలని చూసినట్లయితే. ఒక మంచి కమర్షియల్ సెంటర్లో షాపు అద్దెకు తీసుకొని స్థానికంగా అనుమతులు పొందిన అనంతరం, కోల్డ్ ప్లస్ ఆయిల్ మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
FSSAI నుంచి అనుమతి:
ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మెషిన్ లో వేరుశనగ గింజలు(Peanut Seeds,), నువ్వులు (Sesame seeds,), పొద్దుతిరుగుడు పువ్వు గింజలు (Sunflower Seeds), ఎండు కొబ్బరి(Desiccated coconut) వంటి వాటి నుంచి మీరు నూనెను తీసి ఆర్గానిక్ ఆయిల్స్ పేరిట విక్రయించవచ్చు. అయితే మీరు మార్కెట్లో విక్రయించాలంటే ముందుగా FSSAI నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కస్టమర్ల కోసం మీరు వారి కళ్ళముందే గానుగ ఆడించి నూనెను విక్రయించినట్లయితే మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తుంది. ప్రస్తుతం డాక్టర్లు సైతం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ నే వాడాలని సూచిస్తున్న నేపథ్యంలో మీరు ఈ బిజినెస్ లో చక్కగా రాణించవచ్చు. అయితే మార్కెట్లో లభించే సాధారణ రిఫైండ్ ఆయిల్ కన్నా కూడా ఈ ఆర్గానిక్ ఆయిల్స్ ధర కాస్త ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ ఈ తరహా ఆయిల్స్ వాడకంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో కస్టమర్ బేస్ కూడా పెరుగుతుంది. అలాగే ఈ ఆయిల్స్ పై డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఈ బిజినెస్ ప్రారంభించినట్లయితే ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఖర్చులు పోను కనీసం రెండింతలు వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
( గమనిక: పైన పేర్కొన్న సమాచారం పెట్టుబడి సలహా కాదు. మా వెబ్ సైట్ ధృవీకరించడం లేదు. ఈ వ్యాపారంలో లాభనష్టాలకు మేము బాధ్యత వహించము. మీరు వ్యాపారం ప్రారంభించే ముందు సంబంధిత రంగంలో నిపుణుల వద్ద నుంచి సలహా పొందండి)