Jr NTR : ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా కాంబినేషన్ అంటే

'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జూనియర్ ఎన్టీఆర్‌ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సందీప్‌ రెడ్డి వంగా, తారక్‌ చర్చించుకుంటున్న స్టిల్‌ చూసిన మూవీ లవర్స్‌.. ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు.

New Update
Jr NTR : ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా కాంబినేషన్ అంటే

Junior NTR - Sandeep Reddy Vanga : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో కలిసి తారక్ కనిపించడమే. అతను మరెవరో కాదు గత ఏడాది 'యానిమల్' తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా. ఈ క్రేజీ డైరెక్టర్‌.. జూనియర్ ఎన్టీఆర్‌ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

సందీప్‌ రెడ్డి వంగా, తారక్‌ చర్చించుకుంటున్న స్టిల్‌ చూసిన మూవీ లవర్స్‌.. ఏంటీ ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ క్రేజీ స్టార్స్ కలుసుకోవడం వెనుక సీక్రెట్‌ ఏమీ లేదని.. ఇద్దరిదీ కేవలం సరదా డిస్కషన్‌ మాత్రమేనని ఇన్‌సైడ్‌ టాక్‌.


ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో వీరి కలయికలో సినిమా ఉంటుందేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన 'దేవర' మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు