Juice Fasting: జ్యూస్ ఫాస్టింగ్ ఎప్పుడైనా విన్నారా..? సాధారణంగా ఉపవాస సమయంలో ఫాస్టింగ్, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా బరువు, ఫ్యాటీ లీడర్, రక్తంలో కొలెస్ట్రాల్ వంటి సమస్యల్లో కూడా తగ్గిస్తుంది. కంటిన్యూగా జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
జ్యూస్ ఫాస్టింగ్ ఆరోగ్యానికి పరిరక్షించటానికి, బరువును తగ్గించడానికి ఎంతో మంచిది. ఎవరెవరికి జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మంచిదో మంచిది అనే విషయానికి వస్తే బరువు బాగా తగ్గాలనుకునేవారు, కొవ్వు బాగా కరగాలకునేవారు, ఫ్యాటీ లివర్, పొట్ట బాగా తగ్గాలనుకునేవారు, రక్తంలో కొలెస్ట్రాల్ చాలా స్పీడ్‌గా తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచిది. అలాగే ఆకలి అవ్వని వారికి అరుగుదలుగా సరిగ్గా లేని వారికి జ్యూస్ ఫాస్టింగ్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇలా జ్యూస్ ఫాస్టింగ్ అనేది 15, 10 , 20 రోజులు కంటిన్యూగా చేస్తే చేసిన నష్టమేమీ ఉండదట. జ్యూస్‌లు తాగేటప్పుడు ఉదయం 8 గంటలకు వెజిటేబుల్స్, 11 గంటలకి ఫ్రూట్స్ జ్యూస్, మధ్యాహ్నం రెండు గంటలకి ఫ్రూట్ జ్యూస్, సాయంత్రం ఐదు గంటలకు చెరకు రసం, రాత్రి పడుకునే ముందు మ్యాంగో జ్యూస్ లాంటివి తాగాలి. ఇలా ఐదు సార్లు తాగే జ్యూస్‌ల్లో పంచదార, ఐసు వేయకుండా తేనె వేసుకుని తాగితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే కిడ్నీలు చెడిపోతాయా? నిజమేంటి?