BIG BREAKING: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా

చంద్రబాబు హౌస్‌ అరెస్ట్‌పై వాదనలు రేపటికి వాయిదా పడింది. ఇవాళ(సెప్టెంబర్ 11) ఉదయం నుంచి కస్టడీ విషయమై వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత.. నిశితంగా పరిశీలించి న్యాయమూర్తి వాదనలను రేపటికి వాయిదా వేశారు. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడగగా..వాటికి వివరణ ఇచ్చారు చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా. వివరణ తర్వాత పది నిమిషాలు జడ్జి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌ తర్వాత తిరిగి వచ్చి రేపటికి తీర్పు వాయిదా వేసినట్టు న్యాయమూర్తి చెప్పారు.

New Update
BIG BREAKING: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా

చంద్రబాబు హౌస్‌ అరెస్ట్‌పై వాదనలు రేపటికి వాయిదా పడింది. రేపు(సెప్టెంబర్ 12) ఏసీబీ కోర్టు మరోసారి వాదనలు విననుంది. సుదీర్ఘంగా జరిగిన వాదనలు ఇవాళ్టికి ముగిశాయి. మూడు దఫాలుగా వాదనలు సాగాయి. చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున పొన్నవోలు వాదనలు వినిపించారు. హాని ఉంది వెసులుబాటు కల్పించాలని లూథ్రా వాదించారు. NSG సెక్యూరిటీ ఉందని హౌస్‌ అరెస్ట్ అడుగుతున్నామని లూథ్రా చెప్పారు. అయితే రాజమండ్రి జైలే చంద్రబాబుకు సేఫ్టీ అని పొన్నవోలు వాదించారు. హౌస్‌ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ నొక్కి చెప్పింది. ఇంటికంటే జైలే సేఫ్టీ అని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని సీఐడీ వాదించింది.
తీర్పు వస్తుందనుకున్న దశలో మరోసారి వాదనలు జరిగాయి.

రేపటికి వాయిదా:
సుప్రీంకోర్టు తీర్పులను లూథ్రా ఉదహరించారు. అయితే కేసుల వివరాలు కోరిన న్యాయమూర్తి. కోట్‌ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగారు చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్‌ కోరింది. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడగగా..వాటికి వివరణ ఇచ్చారు చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా. వివరణ తర్వాత పది నిమిషాలు జడ్జి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌ తర్వాత తిరిగి వచ్చి రేపటికి తీర్పు వాయిదా వేసినట్టు న్యాయమూర్తి చెప్పారు. అటు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచిచోటు వేరే ఎక్కడా లేదన్నారు. ఈ స్కామ్‌పై చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని.. చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని చెప్పారు. ఇక చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వైద్యులు వహిస్తారు అని సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, శ్రీరామ్, వివేకానంద కోర్టులో వాదించారు.

చంద్రబాబు అరెస్టుపై దీదీ ఏం అన్నారంటే?
చంద్రబాబు అరెస్టును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రశ్నించాలని.. విచారణ తర్వాతే చర్యలు తీసుకోవాలి కానీ చంద్రబాబు విషయంలో అలా జరగలేదన్నారు. మరోవైపు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ఇవాళ ఆయన కుటుంబసభ్యులు కలవలేదు. ములాఖత్‌ కోసం చంద్రబాబు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోలేదు. సమయం ముగియడంతో అధికారులు ములాఖత్‌ను రద్దు చేశారు. రేపు(సెప్టెంబర్ 12) చంద్రబాబును కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. మొత్తం ముగ్గురికి అవకాశం ఉంది.

ALSO READ: మా నాన్ననే టచ్ చేస్తావా? జగన్‌పై లోకేశ్‌ ఫైర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు