అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, వైసిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి సమక్షంలో వైసిపి లో చేరారు మాజీ జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి, ఆమె కుమారుడు పసుపులేటి సందీప్.
ఈ సందర్భంగా మాజీ జనసేన నేత పసుపులేటి సందీప్ రాయల్ మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ మభ్యపెడతాడని అన్నారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న నేను గల్లీకి కూడా లీడర్ కాకుండా పోయానని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక మహిళ మాటలు నమ్మి.. నన్ను మా అమ్మను పవన్ కళ్యాణ్ రోడ్డుకీడ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మాజీ మంత్రి శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి ..నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే
ఈ క్రమంలోనే నాదెండ్ల మనోహర్ కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ అహంకారి అని.. పార్టీ ఆఫీసుకు హవాలా డబ్బు పంపి మార్చే వ్యక్తి నాదెండ్ల అని ఆరోపించారు. హైదరాబాదు లో భూకబ్జా లో A1 గా ఉన్న వ్యక్తిని పవన్ కమిటీలో పెట్టాడని ఫైర్ అయ్యారు.టిడిపి కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ ఏపీ రాజకీయాల్లో మాట తప్పాడని కామెంట్స్ చేశారు. టిడిపి పంచన చేరి పవన్ మమ్మల్ని మోసం చేసాడని వ్యాఖ్యనించారు. నన్ను చదువు మాన్పించి, సివిల్స్ కోచింగ్ ఆపించి జనసేనలో చేర్చాడని ఆరోపించారు. పవన్ సొంత అవసరాల కోసం నన్ను ఉద్యోగంలో పెట్టుకున్నాడని అన్నారు.
పాతంశెట్టి సూర్యచంద్ర పార్టీ కోసం పనిచేస్తే పవన్ కలవను కూడా కలవలేదని వ్యాఖ్యనించారు. జగన్ పెట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి వైసీపీలో చేరామని తెలిపారు. టిడిపితో కలిసి పనిచేయడానికి జనసైనికులు సిద్ధంగా లేరని వ్యాఖ్యనించారు. ప్రజలకు పవన్, చంద్రబాబుల మీద నమ్మకం లేదని పేర్కొన్నారు. పవన్ నిలకడలేని వ్యక్తి అని..మహిళలకు జనసేనలో మానసిక వేధింపులు ఉన్నాయని ఆరోపించారు.
మాజీ జనసేన రాయలసీమ కన్వీనర్ పద్మావతి మాట్లాడుతూ..2009 నుంచీ చిరంజీవి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్యనించారు. 2014లో జనసేనకు అండగా నిలబడినట్లు ఆమె తెలిపారు. పవన్ ను నమ్మి నా బిడ్డను ఆయన దగ్గరకు పంపితే చాలా గొప్ప బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ను నమ్మి యువతను ఎవ్వరూ పవన్ వద్దకు పంపించ వద్దు అని అన్నారు.పవన్ మాట తప్పి మమ్మల్ని బయటకు పంపేసాడు..నాదెండ్ల మనోహర్ మహిళలను ఎదగనివ్వకుండా తొక్కేసాడు..మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదు..పవన్ కళ్యాణ్ కరక్ట్ గా లేకపోవడంతోనే మహిళలకు జనసేనలో గౌరవం లేదని వ్యాఖ్యనించారు. ఈ అంశం మీద ఎక్కడైనా డిబేట్ కు రెడీ అంటూ ఖరకండిగా చెప్పారు.