జూ.ఎన్టీఆర్ అభిమానిని అందుకే చంపారంటూ షాకింగ్ ట్వీట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని శ్యామ్ ఇకలేరు. అనుమానాస్పద పరిస్థితుల్లో శ్యామ్ మరణించడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ఛీఫ్ గెస్టుగా హాజరైన సమయంలో శ్యామ్ వేదికపై వచ్చి యంగ్ టైగర్‌తో ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే బాడీ గార్డులు పక్కకు నెట్టి వేయడంతో ఎన్టీఆర్ పిలిచి శ్యామ్‌తో ఫోటో దిగాడు. ఆ వీరాభిమాని మరణించడంపై సోషల్ మీడియాలో భారీగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

New Update
జూ.ఎన్టీఆర్ అభిమానిని అందుకే చంపారంటూ షాకింగ్ ట్వీట్..!

jr-ntr-fan-shyam-died-in-suspectable-manner-in-andhra-pradhesh-outrage-in-social-media-viral-news

వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయించి శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. ఇక అసలు వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాలేజ్ స్టూడెంట్. తన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ చింతలూరు గ్రామంలో చనిపోయాడు. చింతలూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందుకే చంపారంటూ.. షాకింగ్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్టీఆర్ అభిమాని ఒకరు పోస్ట్ పెట్టగా.. శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

శ్యామ్ ఉరి వేసుకొని మరణించారనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. దాంతో శ్యామ్ మరణం హత్య, ఆత్మహత్యనా? అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వందలాది మంది శ్యామ్ మరణం వెనుక వాస్తవాలను బయటకు తీసుకురావాలని వైసీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ ఉరి వేసుకొంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి? జేబులో గంజాయి ప్యాకెట్లు ఉంటే.. ఆ మత్తులో ఉరి ఎలా వేసుకొంటాడు? హ్యాండ్ కట్ చేసుకొంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకొంటాడు? అనే భిన్నాభిప్రాయాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం చాలా గుండెకోతకు గురిచేస్తున్నది. సోదరుడి లాంటి శ్యామ్ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాం. ఆయనను ఆ పరిస్థితుల్లో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఏపీ పోలీసులు ఈ ఘటనపై నిజాయితీగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని.. లేదా ఆ నిందితుడిని మాకైనా అప్పజెప్పండంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్, శ్యామ్ సన్నిహితులు, బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/NTRFanTrends/status/1673356687930187776?cxt=HHwWgIDT6dbC-rguAAAA

Advertisment
Advertisment
తాజా కథనాలు