JrNTR on RGV: టీడీపీ భవిష్యత్ ద‌బిడి దిబిడే..! జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి RGV ట్వీట్‌ వైరల్‌!

చంద్రబాబు నాయుడు అరెస్టుని జూనియర్ ఎన్టీఆర్ ఖండించక పోవడం చూస్తుంటే టీడీపీ భవిష్యత్ దబ్బిడి దిబ్బిడి అయ్యేలా కనిపిస్తుందంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పోస్టులో ఎన్టీఆర్‌కి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

New Update
JrNTR on RGV: టీడీపీ భవిష్యత్ ద‌బిడి దిబిడే..! జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి RGV ట్వీట్‌ వైరల్‌!

RGV comments on Chandrababu and Jr NTR: సెన్సేషనల్ అండ్ కాంట్రవర్శియల్ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) ఏం మాట్లాడినా అది వైరల్‌ అవుతోంది. ఏం ట్వీ్ట్ చేసినా అది ట్రేండ్‌ అవుతోంది. ముఖ్యంగా టీడీపీని పొలిటికల్‌గా టార్గెట్‌ చేయడంలో ఆర్జీవీ ఆరితేరిపోయారు. జగన్‌కి సపోర్ట్‌గా ఏకంగా సినిమానే డైరెక్ట్ చేస్తున్న ఆర్జీవీ చంద్రబాబుపై తరచు విమర్శలు చేస్తుంటారు. తనదైన శైలీలో కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా మరోసారి అదే చేశారు. 'చంద్రబాబు నాయుడు అరెస్టుని జూనియర్ ఎన్టీఆర్(junior ntr) ఖండించక పోవడం చూస్తుంటే టీడీపీ భవిష్యత్ దబ్బిడి దిబ్బిడి అయ్యేలా కనిపిస్తుంది' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. పోస్టులో ఎన్టీఆర్‌కి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి:
తెలుగు దేశం కార్యకర్తల్లో రెండు రకాల అభిమానులుంటారు. ఒక వర్గం జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్కడైనా కనిపిస్తే 'సీఎం సీఎం' అంటూ నినాదాలు చేస్తారు. మరో వర్గం లోకేశ్‌కి హైప్‌ ఇస్తూ జూనియర్‌ ఎన్టీఆర్‌ని కార్నర్ చేసేందుకు రెడీగా ఉంటారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించిన టైమ్‌లో ఆయన కంటతడి పెట్టారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అగ్రెసివ్‌గా రియాక్ట్ కాలేదని పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇక ఇటివలి జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా జూనియర్‌ డుమ్మా కొట్టారు. ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో స్మారక చిహ్నం రూ.100 నాణేన్ని ఆవిష్కరించే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. జూనియర్‌ ఎన్టీఆర్ సోదరుడు, నటుడు కళ్యాణ్ రామ్ కూడా హాజరు కాలేదు.

జూనియర్‌పై నట్టి విమర్శలు:
చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరం అంటూ ఫైర్ అయ్యారు సినీ నిర్మాత నట్టికుమార్‌. జూనియర్ ఎన్టీఆర్ సహా చిరంజీవి , మురళీమోహన్, అశ్వనీదత్, రాజమౌళి, దామోదరప్రసాద్ లాంటి సినీ ప్రముఖులతో పాటు తుమ్మల ఇంటి పేరును నందమూరి లాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ కానీ ఇతర సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించకపోవడం దారుణమని మండిపడ్డారు. అటు అన్నిటికంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ విషయంపై స్పందించకపోవడం పట్ల తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తు్న్నారు.

ALSO READ: వాట్‌నెక్ట్స్‌..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు