Jogi Ramesh: ఢిల్లీ వెళ్లింది అందుకే..లోకేష్ పర్యటనపై జోగి రమేష్ హాట్ కామెంట్స్..!!

అవినీతి తండ్రి చంద్రబాబు(Chandrababu) కోసమే కొడుకు లోకేష్‌(lokesh) ఢిల్లీ(delhi) వెళ్లారని విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ మంత్రి జోగి రమేష్(jogi ramesh). మా అయ్యను కాపాడండి అంటూ పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆయన కామెంట్స్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి, స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసి లాయర్ ను తీసుకుని వచ్చారని జోగి రమేష్‌ దుయ్యబట్టారు.

New Update
Jogi Ramesh: ఢిల్లీ వెళ్లింది అందుకే..లోకేష్ పర్యటనపై జోగి రమేష్ హాట్ కామెంట్స్..!!

Jogi Ramesh: అవినీతి తండ్రి చంద్రబాబు కోసమే కొడుకు లోకేష్‌ ఢిల్లీ వెళ్లారని విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ మంత్రి జోగి రమేష్. మా అయ్యను కాపాడండి అంటూ పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే ఢిల్లీలో అసలు లోకేష్ కు పని ఏంటని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి, స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసి లాయర్ ను తీసుకుని వచ్చారని జోగి రమేష్‌ దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో పోలీసులు కేసు నమోదు చేయగా నేడు ఆయన కోర్టు కు హాజరైయ్యారు.

జనసేన టీడీపీ పొత్తు పై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే జగన్ లాంటి వీరుడుని చూసి నేర్చుకోండి అంటూ సవాల్ విసిరారు. 16 నెలలు జైల్లో పెట్టిన ఒక్కడే ధైర్యంగా ప్రజల మద్దతుతో గెలిచాడని వ్యాఖ్యనించారు. టీడీపీ, జనసేన వాళ్ళ బంధం ఫెవికాల్ లాంటిదని  జోగి రమేష్ సెటైర్ వేశారు. జనసేన-టీడీపీ 2014 నుంచే కలిసి ఉన్నారన్నారు. విడిగా వస్తారని వైసీపీ ఎప్పుడూ భావించలేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేనను చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ ధీమ వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అవినీతి రాష్ట్రం గా మార్చాడని విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్‌. హవాలా రూపంలో వేలకోట్ల రూపాయలు దొడ్డిదారిన తరలించడాని.. చంద్రబాబును మేధావి అన్నవారే ముక్కుమీద వేలు వేసుకునేలా చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అదే చంద్రబాబు పాలనలో ఏమీ లబ్ధి జరిగిందో చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యనించారు.

Advertisment
తాజా కథనాలు