ఆకాశవాణిలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే

ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ తీపి కబురు అందించింది. అసైన్‌మెంట్‌ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏపీలోని పలు జిల్లాల్లో 12 టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖలో 8 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.

ఆకాశవాణిలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే
New Update

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విజయవాడ విభాగం చక్కని శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం కల్పించేందుకు తమ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతోపాటు ఈ విభాగానికి సంబంధించి పని అనుభవం ఉన్నవాళ్లకు ప్రధాన్యత ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vijayawada Akashavani : ఈ మేరకు క్యాజువల్‌ ఎడిటర్ గా 1 పోస్ట్, క్యాజువల్‌ న్యూస్‌ రీడర్‌ కమ్‌ ట్రాన్స్‌లేటర్‌ (తెలుగు)లో 02, క్యాజువల్‌ బ్రాడ్‌కాస్ట్‌ అసిస్టెంట్‌ (ప్రొడక్షన్‌)లో 03.. మొత్తం 6 పోస్టులు ఖాలీలున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఈ పోస్టులను అనుసరించి డిగ్రీ, పీజీ డిప్లొమా (జర్నలిజం), డిప్లొమా (రేడియో ప్రొడక్షన్‌), తెలుగు/ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యంతోపాటు ఏదైన సంస్థలో ఇందుకు సంబంధించిన పని అనుభవం ఉండాలి. అభ్యర్థులకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్ కేటగిరీ అప్లికేషన్ ఫీజ్ రూ.354 చెల్లించాలి. SC, ST, OBCలు రూ. 266 చెల్లించాల్సివుటుంది. ఇక నోటిఫికేషన్‌లో సూచించిన దరఖాస్తు నమూనా అప్లికేషన్ ఫామ్ పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ లను ‘హెడ్‌ ఆఫీస్‌, ఆకాశవాణి, ఎంజీ రోడ్డు, విజయవాడ’ (Head Office, Akashavani, MG Road, Vijayawada') చిరునామాకు పంపించాలని కోరింది. ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకునేవారు 2023 నవంబర్ 28వరకూ తమ అప్లికేషన్ ఫామ్ అందించాలని సూచించింది. మరిన్ని వివరాలకోసం వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in/ సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచించారు.

డిగ్రీ అర్హతతో 12 టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు
ఏలూరులోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌- ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 12 టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం డిగ్రీతో కంప్యూటర్స్‌ లేదా బీఈ, బీటెక్‌/ బీసీఏ/ ఎంసీఏ లేదా డిగ్రీతో పీజీడీసీఏ, హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు. అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలని, డిగ్రీ అకడమిక్‌ మార్కులు, తదితరాల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 2023 నవంబర్ 30. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం.. http://117.216.209.136/revcorect/ సంప్రదించగలరు.

Also read : Jobs: డిగ్రీ అర్హతతో… ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్‎మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!

డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఉద్యోగాలు
గుంటూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన గుంటూరు జిల్లాలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లా కోఆర్డినేటర్‌ 01, జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ 01, బ్లాక్‌ కోఆర్డినేటర్‌ 06 మొత్తం 8 ఖాళీలను భర్తిచేయనున్నారు. దీనికి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉన్నవారికి మొదటి ప్రధాన్యత కల్పిస్తామన్నారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చేయాలనుకునేవారు ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్‌ బంగ్లా రోడ్డు, గుంటూరు’ చిరునామాకు 2023 నవంబర్ 27లోగా తమ బయోడేటాను పంపించాలి. మిగతా వివరాల కోసం https://guntur.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ లో ఉంచినట్లు సంబంధింత అధికారులు తెలిపారు.

#vijayawada #jobs #akashavani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe