Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC).. మెడికల్ విభాగంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2, 3తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.

Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం!
New Update

ESIC Notification : నిరుద్యోగులకు(Un-Employees) మరో గుడ్ న్యూస్ అందింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC).. ఎలాంటి రాత పరీక్ష లేకుండా భారీ జీతంతో కూడిన పలు ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్(Notification Release) చేసింది. మెడికల్ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, అడ్జంక్ట్ ఫ్యాకల్టీ వంటి పోస్ట్‌ల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

123 ఉద్యోగాలు.. 
ఈ మేరకు ఈఎస్‌ఐసీ మెడికల్‌లో వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి మొత్తం 123 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదలచేసింది. సూపర్ స్పెషలిస్ట్ కింద ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్స్ సర్జరీ, కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మాటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ వంటి విభాగాల్లో ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

విద్యా అర్హతలు, వయోపరిమితి..
ఎంబీబీఎస్(MBBS) చదివిన వైద్య విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. కొన్ని పోస్టులకు సంబంధిత ఫీల్డ్‌లో స్పెషలైజేషన్ చదివి ఉండాలి. ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్ట్ విభాగాల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మెడికల్ అభ్యర్థుల వయసు 67 ఏళ్లు దాటకూడదు. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు, అడ్జంక్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు గరిష్ట వయసు 70 ఏళ్లలోపు ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి : Neha Sharma : ఎంపీగా పోటీ చేయనున్న రామ్ చరణ్ హీరోయిన్!

ఎంపిక ప్రక్రియ..
వాక్-ఇన్ ఇంటర్వ్యూ(Walk-In Interview) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో రాజస్థాన్‌, అల్వార్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ అండ్ హాస్సిటల్ వేదికగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న మెడికల్ అభ్యర్థులు ఉదయం 9 గంటల లోపు సూచించిన ఆఫీస్‌కు చేరుకోవాలి. సూపర్ స్పెషాలిటీ పోస్టులకు ఏప్రిల్ 2వ తేదీనే ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఫలితాలను ఈఎస్‌ఐ‌‌సీ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ ఆఫర్ లెటర్ అందుకున్న తరువాత షెడ్యూల్ ప్రకారం డ్యూటీలో చేరాలి.

దరఖాస్తు విధానం..
అర్హులైన అభ్యర్థులు ESIC అధికారిక పోర్టల్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని వివరాలు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్‌ను dean-alwar.rj@esic.nic.in అనే ఈమెయిల్‌కు ఇంటర్వ్యూ తేదీ కంటే ముందే మెయిల్ చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.225 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల నుంచి అప్లికేషన్ ఫీజు వసూలు చేస్తారు.

వేతనాలు..
ప్రొఫెసర్ పోస్ట్‌కు జీతం నెలకు రూ. 2,01,213. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,33,802. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,14,955. సూపర్ స్పెషాలిటీ పోస్ట్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.2 లక్షల 40వేల వరకు అందిచనున్నారు. మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ సంప్రదించండి. dean-alwar.rj@esic.nic.in

#esic-jobs #employees-state-insurance-corporation #123-jobs-notification
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe