SBI PO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు 27 డిసెంబర్ ప్రారంభమై 16 జనవరి 2025 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్ సైట్
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
నోటిఫికేషన్ వివరాలు
- పోస్టు నేమ్: ప్రొబేషనరీ ఆఫీసర్
- పోస్టుల సంఖ్య: 600
- అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉతీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: దరఖాస్తు చేసుకునే క్యాండిడేట్స్ వయసు 01.04.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.750 (SC, ST, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపుగా ఉంటుంది)
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- జీతం: నెలకు రూ.48,480 నుంచి 85,920
- ఎంపిక విధానం: ఫేజ్ 1లో - ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2లో - మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 3లో - సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!