AP: ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలెర్ట్‌!

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ చైర్మన్ రవి ప్రకాశ్ ప్రకటించారు.

New Update
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌  చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ చైర్మన్ రవి ప్రకాశ్ ప్రకటించారు. గతంలో కానిస్టేబుల్ రాత పరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అయితే, వీరంతా ఫిజికల్ టెస్టుల కోసం చూస్తున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకాశ్ పేర్కొన్నారు. అర్హత పొందిన అభ్యర్థుల్లో ఫిజికల్ టెస్టు కు హాజరయ్యే వారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 

2022లో వైసీపీ ప్రభుత్వం హయాంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2023 జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అర్హత సాధించారు. వీరిలో 77,876 మంది పురుషులు కాగా.. 17,322 మంది మహిళలు సెలెక్ట్‌ అయ్యారు.

వీరందరికీ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు విడుదల చేశారు. అయితే, ఆ సమయంలో అనివార్యకారణాల వల్ల వాయిదా పడ్డాయి.

 అప్పటి నుంచి ఫిజికల్ టెస్టుల తేదీలకోసం అర్హత సాధించిన అభ్యర్థులు దీని కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా, ఏపీ ప్రభుత్వం ఫిజికల్ పరీక్షలకోసం తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ పడుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు