AP Jobs: ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ నెల 30 వరకే ఛాన్స్!

గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 94 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 7, 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 30,2023.

New Update
Central Govt Jobs: నిరుద్యోగులకు భారీ న్యూ ఇయర్ కానుక.. 27,370 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది గుంటూరులోని జీజీహెచ్. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గుంటూ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ల్యాబ్ టెక్నీషియన్, అనస్థిషియా, టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, సీటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, రేడియోగ్రాఫర్, స్టోర్ కీపర్, పర్సనల్ అసిస్టెంట్ వంటి తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టులు 94కాగా..పోస్టులను బట్టి అర్హతను నిర్ణయించారు. పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొయా ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది.

వయస్సు 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఆన్ లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు చిరునామా పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 30, 2023గా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ లో ఈ సారి కొత్త మార్పులు!

2023-24 సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల్లో మార్పు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు చేపడుతున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక రెండు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే గతంలో తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ కు 11 పేపర్లు నిర్వహించగా హిందీ ఒకటి, మిగతా సబ్జెక్టులు రెండేసి పేపర్లు ఉండేవి. కానీ ఈ రెండేళ్లలో తెలంగాణలో ఆరు పేపర్లతోనే పరీక్షలు పెడుతున్నారు. అయితే ఈసారి మరో కొత్త మార్పు కోసం ఇప్పటికే ఎస్సీఈఆర్టీ అధికారులు వివరణ పంపించగా దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉంది. 

ఈ మేరకు గతంలో 11 పేపర్లతో నిర్వహిస్తున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలను కరోనా ఎఫెక్ట్ తో 2021- 2022 లో 6 పేపర్లకు కుదించింది అప్పటి గవర్నమెంట్. దీంతో 2022 – 2023 విద్యాసంవత్సరం నుంచి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ఫిజిక్స్, బయోలజీ క్వశ్చన్ పేపర్లను మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహించాలంటూ స్టూడెంట్స్, తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సంబంధిత అధికారులు రెండు రోజుల్లో బయోలజీ, ఫిజిక్స్ పేపర్లు పెట్టాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అయితే, ఎగ్జామ్ వేర్వేరు రోజుల్లో నిర్వహించినా మార్కులు మాత్రం సైన్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థలకు టెన్షన్ తగ్గి, సైన్స్ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేందుకు మరింత టైమ్ దొరికే అవకాశం ఉంది. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహిణపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి:  వచ్చే ఏడాది నుంచి టోల్ ప్లాజాలుండవు..కేంద్రం కొత్త ప్లాన్

Advertisment
తాజా కథనాలు