Job Mela in AP: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో రేపు జాబ్ మేళా!

ఏపీలోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. రేపు.. అంటే ఈ నెల 18న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Job Mela in AP: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో రేపు జాబ్ మేళా!
New Update

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 18న మరో జాబ్ మేళా (JOB MELA) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ఎయిర్టెల్, ముత్తూట్ తో పాటు మొత్తం 5 కంపనీలు పాల్గొననున్నాయి. ఆయా కంపెనీల్లో 160 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
VINDHYA E-INFOMEDIA TVT LTD: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. బ్యాంకింగ్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.
DIXON TECHNOLOGIES: ఈ సంస్థలోనూ 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.
GREENTECH INDUSTRRIES INDIA PVT LTD: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. 5వ తరగతి నుంచి పీజీ కలిగిన వారికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.13,500-రూ.15500 వరకు వేతనం ఉంటుంది.


MUTHOOT GROUP:
ముత్తూట్ గ్రూప్ ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ అర్హత వారికి అవకాశం ఉంటుంది.
AIRTEL PAYMENT BANK: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.17,250 వేతనం ఉంటుంది.

జాబ్ మేళా నిర్వహించే చిరునామా:
శ్రీ వీఆర్జేసీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, వెంకటగిరి

#ap-job-mela #private-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe