ఎమ్మెల్యే చెంపపగలకొట్టిన మహిళ...వైరల్ వీడియో..!!

New Update
ఎమ్మెల్యే చెంపపగలకొట్టిన మహిళ...వైరల్ వీడియో..!!

హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల నదుల కరకట్టలు తెంచుకుని ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వరదల కారణంగా ప్రజల సహనం కూడా నశిస్తోంది. ఈనేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కైతాల్ జిల్లాలోని భాటియా గ్రామంలో వరదలతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులను పరామర్శించేందుకు గుహ్లా JJP ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ వెళ్లారు. ఘగ్గర్ నది ఉప్పెంగి ప్రవహిస్తోంది. దీంతో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ సమయంలోనే ఎమ్మెల్యే అక్కడ పర్యటించడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.

publive-image

గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈశ్వర్‌సింగ్‌ను గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు అందరిముందే చెప్పుతో కొట్టింది. ఇంతలో ఎమ్మెల్యే సెక్యూరిటీ అక్కడి నుంచి ఎమ్మెల్యేను సురక్షితంగా తన వాహనంలోకి ఎక్కింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వాస్తవానికి వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించేందుకు జెజెపి ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ వచ్చారు. వైరల్ వీడియోలో, ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఎమ్మెల్యే ముందున్న ఓ మహిళ కోపంతో అతనని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనతో ఎమ్మెల్యేతోపాటు పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ఆ మహిళపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోనని, ఆ మహిళను క్షమించానని ఈశ్వర్ సింగ్ అన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, హర్యానా, పంజాబ్‌లలో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయార. హర్యానాలోని కొన్ని ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు