బీజేపీ కోసం కష్టపడిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యానని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. అందుకే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరానన్నారు. బీజేపీని వీడినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సమయంలో తాను ఎంపీ టికెట్ వద్దని చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. అగ్రనేతల నుంచి తనకు కనీసం ఫోన్ రాకపోవడం బాధ కలిగించిందన్నారు. డీకే అరుణపై తనకు వ్యక్తిగత కక్ష, పగ లేదన్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ గెలుపుకోసం కష్టపడ్డానన్నారు. కుట్రలు చేసే గుణం తనదికాదన్నారు. రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చే విషయం ముందుగా తెలియదన్నారు. తనకు పదవులపై పెద్దగా ఆశలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలపై సంతృప్తిగా ఉన్నానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందరూ తన మనుషులేనని అన్నారు. వారందరితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనకు గ్రూపులు కట్టాలన్న ఆలోచన లేదన్నారు. అందరితో కలిసి పని చేస్తానన్నారు. జితేందర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.