Jithender Reddy: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తనకు ఎంపీ టికెట్ రాకపోవడంతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. A.P జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.\
ALSO READ: కేసీఆర్ కూతురు.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
తనకే వస్తుందన్న ధీమా.. ఢమాల్..
తనకు బీజేపీ అధిష్టానం పక్కాగా టికెట్ ఇస్తుందని భావించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనదే.. తనకు ఎవరు పోటీ లేరు అంటూ ఆయన సామజిక మాధ్యమాల్లో చెబుతూ వచ్చారు. అయితే మొదటి జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ స్థానాన్ని ప్రకటన చేయకుండా హోల్డ్ లో పెట్టింది బీజేపీ అధిష్టానం. ఇందుకు కారణం అక్కడ ఇద్దరు బలమైన నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉండడమే. ఒకవేళ ముందుగా ప్రకటిస్తే పార్టీ చీలుతుందని భావించిన బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు రెండో జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ జాబితాలో జితేందర్ రెడ్డికి షాక్ ఇచ్చింది కమలం పార్టీ. జితేందర్ రెడ్డికి కాకుండా డీకే అరుణకు ఎంపీ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం తనకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జితేందర్ రెడ్డి నిరాశే మిగిల్చింది. అయితే.. టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.