JioEV Aries: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ అమెజాన్ ఇండియా నుండి లిస్ట్ చేయబడింది. దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా కొనసాగుతున్న రిలయన్స్ జియో కొత్త ప్రోడక్ట్ (JioEV Aries)ని పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ కోసం తగిన మరియు అనుకూలమైన కాంపాక్ట్ ఛార్జర్ ని జియో అందించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ అందిరికి అందుబాటులో ఉండేలా అమెజాన్ ద్వారా అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
ఫీచర్లు
జియో తీసుకు వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ని యూనివర్సల్ టైప్ 2 ఛార్జింగ్ కనెక్టర్ తో అందించింది. ఇది టాటా నెక్సాన్, టియాగో, పంచ్, మహీంద్రా XUV400, హ్యుందాయ్ ఐయానిక్, Kia EV6 మరియు లేటెస్ట్ గా వచ్చిన అన్ని హైబ్రిడ్ కార్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ లో అందించిన ఇంటర్నల్ RCD తో షార్ట్ సర్క్యూట్, ఓవర్ కరెంట్, ఓవర్ టెంపరేచర్, ఓవర్ ఓల్టేజ్ వంటి వాటి నుంచి రక్షణ ఉంటుంది.
Also Read : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్!
ప్రైస్
జియో ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ని రూ. 46,499 రూపాయల ధరతో అమెజాన్ నుండి లిస్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ పైన No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ జియో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ను నేరుగా కొనుగోలు చేయాలనుకునే వారు Buy From Here లింక్ పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.