ఎవరికీ పట్టని ఎదురు మొండి దీవుల ప్రజల గోడు.!

కృష్ణా జిల్లాలో జింకపాలెం, నాచుగుంట గ్రామాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సరిహద్దుల గొడవ మరింత ముదిరింది. న్యాయం జింకపాలెం గ్రామం వైపు ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు నిరసన చేపట్టారు. ఎదురు మొండి దీవుల ప్రజల గోడు ఎవరికీ పట్టడం లేదని వాపోతున్నారు.

New Update
ఎవరికీ పట్టని ఎదురు మొండి దీవుల ప్రజల గోడు.!

Krishna District:  ఎదురు మొండి దీవుల ప్రజల గోడు ఎవరికీ పట్టడం లేదని స్ధానిక గ్రమస్థులు వాపోతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా ఎదురుమొండి దీవులలో జింకపాలెం, నాచుగుంట గ్రామాల మధ్య సాగుతున్న చేపల వేట.. సరిహద్దుల గొడవ ముదిరి తారాస్థాయికి చేరుకుంది. న్యాయం జింకపాలెం గ్రామం వైపు ఉన్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యను అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో జింకపాలెం గ్రామస్థులు రెండు రోజులుగా గ్రామంలో నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ తో సహా పలు అధికారులకు వారి గోడు చెప్పుకుని అర్జీలు సమర్పించినా.. కనీసం గ్రామంలో పరిస్థితిని పరిశీలించడానికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామం అయినందువలన చిన్న చూపు చూస్తున్నారని వాపోతున్నారు. అయితే, ఈ గ్రామంలో కనీసం మౌలిక వసతులు కూడా లేకపోవడం శోచనీయం.

Also Read: నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇవే.!

గ్రామానికి వచ్చే ఒకే ఒక రహదారి పాడైపోయింది. తాగడానికి కాదు కదా కనీసం వాడుక నీరు కూడా మలినమైనవేనని.. వైద్య సదుపాయం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఖ్య కూడా ఎక్కువునే నని ఇలా దశాబ్దాలుగా ఇన్ని సమస్యలున్నా, ప్రభుత్వం కనెత్తి కూడా చూడటం లేదని మండిపడుతున్నారు. చేసేదేమి లేక గ్రామ ప్రజలు ఎలాగోలా జీవనం నెట్టుకొస్తున్నారు. చిన్న గ్రామం అయినందువలన వీరి వేట సరిహద్దులలోకి.. పెద్ద పెద్ద నాయకుల అండతో పరిసర గ్రామ ప్రజలు దశాబ్దాలుగా ఉన్న కట్టుబాట్లు మీరి చొచ్చుకొచ్చి వీరి జీవన ఆధారం మీద దెబ్బ కొట్టి ఆర్ధికంగా, మానసికంగా కుంగదీసి ఆ గ్రామ ప్రజల్ని బ్రతుకుదెరువు కోసం వలసపోయే పరిస్థితిని కొనితేస్తున్నారని బాధాపడుతున్నారు. వీరి గోడుని ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని ఆందోళన చేపట్టారు. ఆ సరిహద్దు వివాదాంను పరిష్కరించి కనీసం మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు