Jd: జై భారత్ పార్టీ స్థాపించింది ఇందుకే: జేడీ లక్ష్మీనారాయణ

ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్ చేయడం కుట్రపూరితమైన చర్య అన్నారు. రాజకీయాల్లో ఒక మార్పు తేవాలని జై భారత్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు.

New Update
Jd: జై భారత్ పార్టీ స్థాపించింది ఇందుకే: జేడీ లక్ష్మీనారాయణ

Jd Lakshmi Narayana: జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారుతున్నాయని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఒక మార్పు తేవాలనే జై భారత్ పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. తాను విశాఖలో జనసేన నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసినట్లు తెలిపారు. విశాఖ ప్రజలు చాలా మంచివారన్నారు. మళ్లీ ఈ సారి జనసేన నుండి తనను పోటీ చేయమన్నారని.. కానీ తాను పార్టీ నుండి బయటికి వచ్చానన్నారు.

Also Read: ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌.. సీటు మార్చడంతో రామరాజు వర్గం ఆందోళన


ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం రాజకీయ పక్షాల కుట్రపూరితమైన చర్యలన్నారు. రాజకీయాల్లో విలువలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు పెట్టుకున్నాయన్నారు. అయితే, బీజేపీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటని చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు