Tadipatri Ex. MLA JC Prabhakar Reddy : గత ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy). తమను దొంగలుగా చిత్రీకరించి తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు. కావాలనే తన బస్సులపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బస్సులు సీజ్ చేసిన విషయంలో తాను ఎవరినీ వదిలిపెట్టబోనని జేసీ హెచ్చరించారు. సజ్జల, పేర్ని నాని (Perni Nani), ఇతర ట్రాన్స్పోర్ట్ అధికారులపై JC ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read: డ్యామ్ లో తగ్గిన నీరు..బయటపడ్డ కారు..అందులో అస్థిపంజరాలు!
తనకు జరిగిన అన్యాయంపై JC కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు న్యాయం జరగాలని లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతానన్నారు. చంద్రబాబు (Chandrababu) కు తాను వ్యతిరేకం కాదని ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమన్నారు. ఒకవేళ తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.