YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 29 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి వైఎస్ విజయమ్మను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో కలవడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ అంటేనే గిట్టని ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిశారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. విజయమ్మ స్వగ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉండడంతో జేసీ ఫ్యామిలీతో ఆమెకు బంధుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉండేది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జేపీ దివాకర్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే.. వైఎస్ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఈ రెండు కుటుంబాలకు మధ్య విభేదాలు వచ్చాయి. ఇది కూడా చదవండి: Sharmila: ఇప్పటికే మూడు వారాలు.. మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా?.. కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్..! జేసీ బ్రదర్స్ వైఎస్ టార్గెట్ గా అనేక సార్లు విమర్శలు చేశారు. జగన్ కాంగ్రెస్ ను వీడి.. సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత సైతం జేసీ బ్రదర్స్ తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికల్లో వీరి ఫ్యామిలీ ఉంచి ఎంపీగా బరిలోకి దిగిన పవన్ రెడ్డి, ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన అస్మిత్ రెడ్డి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అనంతరం వీరిపై జగన్ ప్రభుత్వం పలు కేసులను నమోదు చేసింది. ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు. ఈ సమయంలో జగన్ టార్గెట్ గా ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడం రెండూ జరిగిపోయాయి. దీంతో జేసీ ఫ్యామిలీ మళ్లీ తాడిపత్రి ప్రాంతంలో పవర్ ఫుల్ గా మారింది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. జగన్ కు బద్ధ శ్రతువుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిశారు? అన్న విషయంపై విశ్లేషణలు సాగుతున్నాయి. ఇది కూడా చదవండి: AP: టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్.. కొనసాగుతున్న పోలీసుల వేట..! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి