Jawan Trailer: జవాన్ ట్రైలర్ విడుదలతో బాలీవుడ్ బాద్షా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అలా ట్రెండ్ ఐపోయింది. షారుఖ్ ఖాన్(shahrukh khan) ఈ చిత్రంలో మాజీ సైనికునిగా నటించాడు. ఈ సినిమాలో షారుఖ్ సరసన నయనతార(nayanatara) నటించారు. ఈ ట్రైలర్లో షారుఖ్ గతంలో నయనతారను వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రొమెంటిక్ సీన్స్‌లో వాళ్లు కనిపించారు. మరో అగ్రతార దీపికా(deepika) పదుకొణె ప్రెజెన్స్ కూడా ఉంది. రెజ్లింగ్ మ్యాచ్‌లో షారూఖ్‌ను ఓడించినట్టు ట్రైలర్లో ఉంది. అది కూడా సరదా సీన్‌లాగా ఉంది. విజయ్ సేతుపతి విభిన్న అవతార్లలో కనిపిస్తాడు కానీ ‘ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆయుధ వ్యాపారిగా’ కనిపిస్తాడు.
పూర్తిగా చదవండి..Jawan trailer: భిన్న అవతారాల్లో రెచ్చిపోయిన బాలీవుడ్ బాద్షా.. జవాన్ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కి షారుఖ్ ట్రీట్!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన సినిమా 'జవాన్' ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 2:45 నిమిషాల నిడివి గల వీడియోను చూసి షారుఖ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా, దీపికా పడుకొనె, ప్రియమణిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
Translate this News: