Jawan: దుమ్మురేపుతున్న 'జవాన్'..బాలీవుడ్ బాద్‌షా అని ఊరికే అనరు మరి..! కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ కొత్త సినిమా 'జవాన్' ట్రైలర్ దుమ్మురేపుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. ట్రైలర్‌లో ఒక్కో షాట్, ఒక్కో విజువల్ అదిరిపోయే లెవల్‌లో ఉన్నాయి. ట్రైలర్ చివరిలో గుండుతో కనిపించాడు షారుఖ్..! By Trinath 10 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన సినిమాకు సంబంధించినవి ఏమైనా రిలీజ్ అవుతున్నాయంటే కళ్ల కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 'జవాన్' ట్రైలర్ వచ్చి రావడంతోనే వ్యూస్ వర్షం కురిపిస్తోంది. కమర్షియల్ మూవీస్‌తో విజయ్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చిన అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అసలు షారూక్ ఖాన్ స్టార్ డమ్‌ను అట్లీ ఎలా చూపించబోతున్నారు? అసలు సినిమా అన్నీ వర్గాలను ఆకట్టుకుంటుందా? అని అందరూ చర్చించుకున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్టు సినీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. జవాన్ ట్రైలర్ లో షారుఖ్ పఠాన్ తర్వాత జవాన్: ‘పఠాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీటైంది. తాజాగా మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ని వెరైటీగా ప్రీవ్యూ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార తొలిసారి నటిస్తోంది. బాలీవుడ్‌లో ఈమెకు తొలి చిత్రం. ప్రియమణి మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల పాటు ఉన్న ట్రైలర్‌లో కథ రివీల్ అవ్వకుండా మూవీ మేకర్స్ జాగ్రత్త పడ్డారు. అటు ట్రైలర్ చూసిన వాళ్లకి అట్లి డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా గుర్తు వస్తుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరో కమర్షియల్ హిట్ కొడతాడా..? కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు తగ్గినా.. 'పఠాన్'తో బాక్సిఫిస్‌ను షేక్ చేసిన కింగ్‌ఖాన్ మరోసారి తన సత్తా చాటేందుకు 'జవాన్' రూపంలో వస్తున్నాడు. ‘పఠాన్’ సినిమా ఓవరాల్‌గా రూ.1,000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా.. తన రికార్డును తానే బద్దలు కొట్టడానికి షారుఖ్ ఈసారి జవాన్‌తో వస్తున్నాడని ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను రూపు మాపేందుకు.. తప్పులను సరిదిద్దేందుకు షారుఖ్ జవాన్‌తో వస్తున్నడని ట్రైలర్ చూసి జనాలు విశ్లేషిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్‌గా రూపొందిన జవాన్ మూవీ ప్రివ్యూ సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ ఇచ్చింది. భారీ విజువల్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. సినిమాలో భారీ విస్పోటన సన్నివేశాలతో రూపొందిన యాక్షన్ సీక్వెన్స్, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. చివరల్లో గుండుతో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసాడు షారుఖ్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి