/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jawan-2-jpg.webp)
జవాన్ హవా..
ఈ వీకెండ్ దేశవ్యాప్తంగా జవాన్ హవా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఏపీలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేనప్పటికీ, నైజాంలో మాత్రం ఇది పెద్ద హిట్టయింది. ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా నైజాం రీజియన్ లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని మించిపోయింది జవాన్. ఓవరాల్ గా చూసుకుంటే, ఇండియా అంతటా ఇది బ్లాక్ బస్టర్ హిట్.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఓపెనింగ్ డే కలెక్షన్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. కానీ అవి రెండో మరియు మూడో రోజు పుంజుకున్నాయి. నవీన్ పోలిశెట్టి, అనుష్క నటించిన ఈ చిత్రం, స్పెర్మ్ డొనేషన్ చుట్టూ తిరుగుతుంది. అందుకే పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలవలేకపోయింది. అయితే మెజారిటీ యూత్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు ఓటేస్తున్నారు. దీనికి కారణం సినిమాలో కామెడీ. అటు ఓవర్సీస్ లో మాత్రం ఇది పెద్ద హిట్.
జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రాకతో ఖుషి డీలా పడింది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమాకు ప్రారంభంలో మంచి వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. వీకెండ్ వసూళ్లు బాగున్నప్పటికీ, వారం రోజుల వసూళ్లు చూసుకుంటే నిరాజనకంగా ఉన్నాయి.
ఇటు జైలర్ హవా కూడా తగ్గింది. రిలీజై చాలా రోజులు అవ్వడం, పైగా ఓటీటీలోకి కూడా రావడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. అయితే ఈ 5 వారాల్లో జైలర్ సినిమా ఎంత పిండుకోవాలో అంతా లాగేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. రజనీకాంత్ కెరీర్ లోనే అత్యథిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 635 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక ఓటీటీ విషయానికొస్తే, ప్రస్తుతం 29 దేశాల్లో ఈ సినిమా అమెజాన్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఈ సినిమాలతో పాటు కార్తికేయ హీరోగా బెదురులంక అనే సినిమా రిలీజైంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, చిన్న మూవీగా థియేటర్లలోకి వచ్చింది. ప్రారంభంలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఓవరాల్ గా సినిమాకు హిట్ టాక్ రాలేదు. అయితే పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.
Also Read: మెగా కోడలిని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్