NVS : రాతపరీక్ష లేకుండా 500 టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే! జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి రాత పరీక్షలేకుండా టీచర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టీజీటీ 283, పీజీటీ 217.. మొత్తం 500 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Apr 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి NVS Recruitment 2024: నవోదయ విద్యాలయ సమితి (NVS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనుండగా.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు భోపాల్ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న జవహర్ నవోదయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పోస్టులు: 500 టీజీటీ పోస్టులు: 283 సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్. అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి. ఇది కూడా చదవండి: Urinary Infection: పురుషులలో యూరిన్ ఇన్ఫెక్షన్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..! పీజీటీ పోస్టులు: 217 సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి. వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250. టీజీటీలకు రూ.40,625 అందించనున్నారు. వయో పరిమితి: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 26. 2024 మే 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అధికారిక వెబ్ సైట్: https://drntruhs.in/jnv-tgt-pgt-recruitment/ #jawahar-navodaya #teacher-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి