NVS : రాతపరీక్ష లేకుండా 500 టీచర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే!

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి రాత పరీక్షలేకుండా టీచర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ అయింది. టీజీటీ 283, పీజీటీ 217.. మొత్తం 500 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
NVS : రాతపరీక్ష లేకుండా 500 టీచర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే!

NVS Recruitment 2024: నవోదయ విద్యాలయ సమితి (NVS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనుండగా.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న జవహర్ నవోదయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 500

టీజీటీ పోస్టులు: 283

సబ్జెక్టులు:
హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్.

అర్హత:
సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

ఇది కూడా చదవండి: Urinary Infection: పురుషులలో యూరిన్ ఇన్ఫెక్షన్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

పీజీటీ పోస్టులు: 217

సబ్జెక్టులు:
హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,

అర్హత:
సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

వేతనం:
నెలకు పీజీటీలకు రూ.42,250. టీజీటీలకు రూ.40,625 అందించనున్నారు.

వయో పరిమితి:

01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌ లో అప్లయ్‌ చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 2024 ఏప్రిల్‌ 26. 2024 మే 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అధికారిక వెబ్ సైట్: https://drntruhs.in/jnv-tgt-pgt-recruitment/

Advertisment
తాజా కథనాలు