/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cm-seat-sharing-jpg.webp)
AP politics pawan tdp alliance: ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టిన్నట్టు మాట్లాడడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. అటు బీజేపీ వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తోంది. బీజేపీ కూడా తమతోనే కలిసి వస్తుందని పవన్ చెప్పగా.. ఇప్పటివరకు ఈ విషయంపై అటు ఏపీ బీజేపీ పెద్దల నుంచి కానీ హైకమాండ్ నుంచి కానీ క్లారిటీ రాలేదు. పొత్తుల విషయం కేంద్ర పెద్దలే నిర్ణయిస్తారని ఏపీ బీజేపీ ప్రకటన విడుదల చేయడం తప్ప ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.
50-50 కోసం:
పొత్తు విషయంలో పవన్ కళ్యాన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తనకు ఏం కావాలో అది అడిగేందుకు ఏ మాత్రం ఆలోచించడంలేదు. తనకు ఇన్ని సీట్లు కావాలని ఖరాఖండిగా చెప్పేస్తున్నట్టు సమాచారం. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేకున్నా.. 25 నుంచి 40 సీట్లను జనసేన అడిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవర్ షేరింగ్‌పైనా జనసేన కన్నేసింది. రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని జనసేన పట్టుబడుతోంది. ముఖ్యమంత్రిగా పవన్‌కు అవకాశం ఉంటేనే... కాపు ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తేనే.. పూర్తి స్థాయిలో పొత్తు బాగుంటుందని జనసేన అభిప్రాయపడుతోంది.
చంద్రబాబు ఏం చేస్తారు?
మరోవైపు పవన్ అడిగినన్ని సీట్లకు చంద్రబాబు అంగీకరిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో పవన్ పార్టీకి కేవలం ఒక్క సీటే వచ్చింది. ఇప్పుడు పవన్ 25 నుంచి 40 సీట్లను అడుగుతున్నారు. అయితే ఈ నాలుగేళ్లలో పవన్ గ్రాఫ్ పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పవన్ మైలేజీ పెరిగిందని చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతాలను పూర్తిగా పవన్‌కి అప్పగించవచ్చని జనసేన వర్గాలు అంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారోనన్నది చూడాల్సి ఉంది. పవన్‌తో కలిసి పోటి చేస్తే ఓట్లు చీలకుండా ఉంటాయని 2014 ఎన్నికలు నిరూపించగా.. 2019ఎన్నికల్లో ఓట్లు చీలిపోయినట్టు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ALSO READ: భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు