Janasena Support to Anganwadis: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజవర్గం కంకిపాడులో అంగన్వాడీల ఆందోళనకు మద్దతూ తెలిపారు జిల్లాలోని జనసైనికులు. ముప్పారాజ, జరుగు ఆదినారాయణ, తాటిపూడి గణేష్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీల ఆకలి కేకలు కనిపించవా జగన్ రెడ్డీ? అని నిప్పులు చెరిగారు. ఎండా వాన లెక్క చేయకుండా చేస్తున్న పోరాటం ఆశ్చర్యకరంగా ఉందని..కానీ సీఎంగా ఉన్నా మీరు మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు.
Also Read: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర సర్కార్
ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు కల్లబొల్లి కబుర్లు చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయమంటే కేసులు పెట్టి, అధికారులను పంపించి బెదిరింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని జనసేన నాయకులు ముప్పా రాజు అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటంలో తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే మండుటెండలో పోరాటం చేస్తున్న మహిళలపై వేధింపులు బాధాకరం అన్నారు. తెలంగాణ కంటే రూ.1000 ఎక్కువ జీతమిస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, ఇప్పుడు అసలు జీతాలే ఇవ్వకుండా అంగన్వాడీ మహిళలను పస్తులు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.
తాడిగడప మున్సిపల్ అధ్యక్షుడు తాటిపూడి గణేష్ మాట్లాడుతూ..అంగన్వాడీలంటే అంగట్లో సరుకు అనేలా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెబుదామన్నారు. ఆడవారు ఉసురు పోసుకున్న వాళ్ళు చరిత్రలోనే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అరాచకాన్ని అంతమందిస్తామని..హక్కుల సాధన కోసం అంగన్వాడీ మహిళలు చేస్తున్న పోరాటానికి ఏ క్షణం ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జరుగు ఆదినారాయణ, వడ్డే జీవ, తాటిపూడి గణేష్, జనసేన వీర మహిళ మహాలక్ష్మి, ఓంకార్, జనసేన నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.