Pruthvi: లోకేశ్‌ది ఎర్ర డైరీ.. నాది పీఆర్‌ డైరీ.. అందరి జాతకాలు బయటపెడతా.. సినీనటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

తాను చంద్రబాబు, పవన్ వదలిన బాణాన్ని అన్నారు సినీనటుడు, జనసేన నేత పృథ్వీ. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ బాణం అని అది వైసీపీని ఏం చేస్తుందో చూడాలని అన్నారు. టీడీపీ, జనసేన కూటమి 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

New Update
Pruthvi: లోకేశ్‌ది ఎర్ర డైరీ.. నాది పీఆర్‌ డైరీ.. అందరి జాతకాలు బయటపెడతా.. సినీనటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

ఇప్పడు షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని జనసేన నేత పృథ్వీ అన్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఇప్పడు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాణమని వ్యాఖ్యానించారు. పాతరోజులు పోయాయని, ఇప్పుడు షర్మిల ఇండివిడ్యువల్‌ అని చెప్పుకొచ్చారు. ఆ కాంగ్రెస్‌ బాణంతో వైసీపీకి జరిగేదేమిటో వేచి చూడాలన్నారు. టీడీపీ, జనసేనల జెండాల కలయిక శుభసూచికమన్న పృధ్వీ అది మార్పునకు సంకేతమన్నారు. ఓ చోట గెలిచిన వ్యక్తిని మరోచోట నిలబెడితే ఎవరు ఓటేస్తారంటూ వైసీపీ ఇన్‌చార్జిల మార్పును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. 175 సీట్లు మీరు గెలుస్తామని చెప్పిన వారికి ఇప్పుడు ఈ భయం ఎందుకు పట్టుకుందని ప్రశ్నించారు. తాను సినిమాలో వేసిన అంబటి డ్యాన్సు గురించి ముందుగా తనకు తెలియదని, డైరెక్టర్ చెప్పినట్టే తాను చేశానని చెప్పారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ ప్రధాని కాడు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన కూటమి 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తాను చంద్రబాబు, పవన్ వదిలిన బాణాన్ని అన్నారు పృథ్వీరాజ్‌. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. రోజా వంటి బూతుల మినిస్టర్ల ఆటలు ఇక సాగవన్నారు. ఏపీలో ఒక్క రాజధానే లేదని, మూడు రాజధానులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై టీడీపీ న్యాయపోరాటం..!

ఎన్నికల్లో తాను ప్రచారానికి వస్తానని, ఒక్కొక్కరి దుమ్ము దులుపుతానని అన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ తనను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి తేలుస్తానన్నారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని, లోకేశ్‌ దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు తన దగ్గర కూడా ఓ పీఆర్ డైరీ ఉందని అన్నారు. అందరి జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరుగలేదని విమర్శించిన పృథ్వీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.

Advertisment
తాజా కథనాలు