/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Pawan-Kalyan-Nadendla-manohar-.jpg)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్ గా తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను నియమించారు. ఈ మేరకు శాసన సభాపతికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాచారం అందించారు. పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి అవకాశం దక్కింది. కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నియమితులయ్యారు.