JSP: 'కేంద్రం డబ్బులు కొట్టేసి మీ బిల్డప్ ఏంటి? దవడలు పగిలిపోతాయి' జోగి రమేష్ జనసేన నేత వార్నింగ్.!

మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే దవడలు పగిలిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇళ్లు నిర్మానం పేరుతో కేంద్రం డబ్బులు వేల కొట్లు కొట్టేసి మీ బిల్డప్ ఏంటి? అని మండిపడ్డారు.

JSP: 'కేంద్రం డబ్బులు కొట్టేసి మీ బిల్డప్ ఏంటి? దవడలు పగిలిపోతాయి' జోగి రమేష్ జనసేన నేత వార్నింగ్.!
New Update

Janasena Pothina Mahesh : విజయవాడలో మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఫైర్ అయ్యారు. సెంట్ భూమి కింద ఇళ్లు నిర్మించే పధకం పేరుతో 35వేల కోట్లు లూఠీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ విచారణ చేయాలని మోడీకి మా అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాయడంతో జగన్ కు, జోగి రమేష్ కు వణకు మొదలైందని కౌంటర్లు వేశారు. మహిళలను మోసం చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ తో సహా మంత్రులు వేల కోట్లు దోచుకుని సంపన్నులు అయ్యారన్నారు. మీ ధన దాహంతో మహిళలను కూడా అప్పుల పాలు చేశారని విమర్శలు చేశారు.

Also Read: మంచు కురిసే సమయంలో జర్నీ చేస్తున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటిస్తే నో యాక్సిడెంట్స్!

దోపిడీకి కొత్త పాలసీనే ఈ ఇళ్ల నిర్మాణం అంటూ ధ్వజమెత్తారు. మీరు సమయం, స్థలం ఎక్కడ చెప్పినా.. మేము రెడీ..మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.. మా సవాల్ ను స్వీకరించండి అంటూ డిమాండ్ చేశారు. అంశాల వారీగా మా పవన్ కళ్యాణ్ ప్రధానికి లేఖ రాశారు..వాటిపై మాట్లాడకుండా.. నోటికొచ్చినట్లు కూస్తే దవడలు పగిలిపోతాయని హెచ్చరించారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పింది జగన్ కాదా.. 29లక్షలే లబ్దిదారులు ఉన్నారని ప్రభుత్వమే ప్రకటించింది.. 21లక్షల మందిని గుర్తించి, కేవలం 12లక్షల మందికే ఇళ్లు ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా ఎందుకూ పనికిరాని కాగితాలు చేతిలో పెట్టారని నిప్పులు చెరిగారు. మూకుమ్మడిగా ఎక్కడైనా మీరు గృహప్రవేశాలు చేయించారా? పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.



ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి 14,360 కోట్లు రాగా రూ. 11,358 కోట్లు మాత్రమే  జగన్ ఖర్చు చేశారని చెప్పారు. కేంద్రం డబ్బులు కొట్టేసి మీ బిల్డప్ ఏంటి..మీ స్టిక్కర్లు ఏంటి? అని మండిపడ్డారు. మార్కెట్ రేటును మూడింతలు చేసి స్థానిక ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు దోచుకున్నది నిజం కాదా? 12వేల ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారా లేదా? మా నాయకుడు చెప్పింది నిజం అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. వేల కోట్ల స్కాం జరిగిందంటే.. వ్యక్తిగతంగా దూషణలకు దిగుతారా? కేంద్రం సొమ్ము కొట్టేస్తే.. మోడీకి లేఖలు రాయడం తప్పా? అని ప్రశ్నించారు.

#andhra-pradesh #janasena-pothina-mahesh #minister-jogi-ramesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe