హైదరాబాద్‌ పోలింగ్ పై జనసేనాని షాకింగ్ కామెంట్స్.!

హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 కూడా ఉండకపోవడం బాధకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. యువత ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారన్నారు.

New Update
హైదరాబాద్‌ పోలింగ్ పై జనసేనాని షాకింగ్ కామెంట్స్.!

Pawan Kalyan: మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ ఓటింగ్‌ పర్సెంటేజ్‌‌పై  అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో 50 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు జనసేనాని. యువత అనేది రాష్ట్రానికి భవిష్యత్ లాంటిదని.. జనసేన పార్టీలో అలాంటి యువత ఉన్నారన్నారు.

Also Read: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ సర్కార్‌ కు కేఆర్ఎంబీ లేఖ.!

యువతకి మంచి భవిష్యత్ ఉండాలని జనసేన ఎప్పుడూ కోరుకుంటుందని పవన్ చెప్పారు. ప్రజలకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. జనసేనలో యువత కమిట్ మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ధైర్యం తప్ప ఏమీ లేదని తెలిపారు. రాష్ట్రంలో జనసేనకు ఆరున్నర లక్షల కేడర్ ఉందని అన్నారు.

ఈ సందర్భంగానే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని మరోసారి తేల్చి చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నా సినిమాలు ఆపేసినా, కేడర్ ను అరెస్టులు చేసినా తాను ఏనాడు కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమని చెప్పిన బీజేపీ కూడా మనతో కలసి వస్తోందని అని అన్నారు. పార్టీ కమిట్ మెంట్, భావజాలం కారణంగానే బీజేపీ మనతో కలసివస్తోందని వెల్లడించారు. అయితే, తాను ఎప్పుడు జాతీయ నేతల గుర్తింపు కోసం తహతహలాడనని అన్నారు.

Advertisment
తాజా కథనాలు