Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరికొత్త వ్యూహం.. ఆ రెండు చోట్ల నుంచి పోటీ..!

జనసేనాని పవన్ కల్యాణ్‌ ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ, చంద్రబాబుతో పవన్‌ చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరికొత్త వ్యూహం.. ఆ రెండు చోట్ల నుంచి పోటీ..!
New Update

Pawan Kalyan to Contest As MP and MLA: ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో (TDP) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగానే జనసేనాని 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలను తీసుకున్నారు. అయితే, కేవలం 5 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. త్వరలోనే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: రాజకీయాల్లో రోజాది ఐరన్ లెగ్.. సెల్వమణికి వైసీపీతో సంబంధమేంటి..?

ఇదిలా ఉండగా ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉండడంతో జనసైనికుల తో పాటు పవన్ (Pawan Kalyan) అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సారి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేదంటే ఎంపీగా బరిలో దిగనున్నారా? అని ఆసక్తి నెలకొంది. అయితే, జనసేనాని పవన్ కల్యాణ్‌ సరికొత్త వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారట. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ, చంద్రబాబుతో పవన్‌ చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!

ఒకవేళ పవన్‌ ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినెట్‌లో (Central Cabinet) చోటు దక్కుతుందని తద్వారా రాష్ట్రంపై పట్టు సాధించాలని పవన్ ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి (Anakapalle) లేదా మరోచోట నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గతంలో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు స్వయంగా పవనే బరిలోకి దిగే అవకాశం కినిపిస్తోంది. 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. మరి ఈసారి గెలుపు సాధిస్తారా? లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇదిలా ఉండగా.. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి MPగా పోటీ చేసి అల్లు అరవింద్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

#janasena-chief-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe