AP Deputy Speaker: జనసేనకు డిప్యూటీ స్పీకర్.. ఆ ఎమ్మెల్యేకు ఛాన్స్?

డిప్యూటీ స్పీకర్ పదవిని కూటమి నుంచి జనసేనకు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంతం నానాజీ, లోకపు మాధవిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
AP Deputy Speaker: జనసేనకు డిప్యూటీ స్పీకర్.. ఆ ఎమ్మెల్యేకు ఛాన్స్?

ఏపీలో కొత్త శాసనసభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే.. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. కూటమిలో మరో కీలక భాగస్వామి అయిన జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.

ఈ రోజు తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన పవన్ కల్యాణ్‌ అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎంపిక సంబంధించి జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవిని మన పార్టీకే కేటాయిస్తారని జనసేన ఎమ్మెల్యేలతో చెప్పిన పవన్ కల్యాణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. పంతం నానాజీ, లోకపు మాధవి పేర్లలో ఒకరి పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ఖరారు చేసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు