/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jsp-3-jpg.webp)
Janasena Konathala Ramakrishna: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన నాయకుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. ఈ ఐదు సంవత్సరాలలో ఇరిగేషన్ కోసం బడ్జెట్లో రూ. 3285 కోట్ల కేటాయించిగా కేవలం రూ. 593 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు.
Also Read: కొలికపూడి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు
బడ్జెట్ లో కేటాయించిన వాటిలో 20 శాతం కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చుపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ మూడు ద్వారా 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రూ. 7200 కోట్లు కేటాయించిగా, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం 10 జీవోలు విడుదల చేసి అభివృద్ధికి సహకరించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం భూసేకరణ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ చూపించారని వ్యాఖ్యానించారు.
Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!
ఇదిలా ఉండగా..పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కు అనకాపల్లి టికెట్ కేటాయించారు. దీంతో టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ అసహనం వ్యక్తం చేసినా తరువాత అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇలా అనకాపల్లి టీడీపీలో నెలకొన్న అసంతృప్తి సద్ధుమణిగింది.