Kiran Royal: తిరుమలలో భక్తుల దోపిడీ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే జరిగేది ఇదే: కిరణ్ రాయల్

తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారన్నారు తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్. ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి.. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నారు.

Kiran Royal: తిరుమలలో భక్తుల దోపిడీ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే జరిగేది ఇదే: కిరణ్ రాయల్
New Update

Janasena Kiran Royal: తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని.. టీటీడీ ఈవోని కలిసి పోలీసులకు కంప్లయింట్ ఇవ్వనున్నామన్నారు.

Also Read: వామ్మె.. ఫోన్ పేలి యువకుడి మృతి..!

ఈ క్రమంలోనే తిరుపతి వైసీపీ ఇంఛార్జి భూమన అభినయ్‌ రెడ్డి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చేసిన రాజీనామాను ఎందుకు పబ్లిసిటీ చేయలేదని ప్రశ్నించారు. తిరుమలలో అన్ని చోట్లా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎవరయితే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారో వారందరినీ బయట పెడతామన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని.. రవీంద్ర బాబు అనే వ్యక్తి కనుసన్నల్లో తిరుమలలో పలు మఠాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు.

#janasena-kiran-royal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe