Pawan Kalyan: ఈరోజు నుంచి రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పందించారు. వైజాగ్ ఘటన నేపథ్యంలో చంద్రబాబు తనకు మద్దతు తెలిపారన్నారు. అలాంటి చంద్రబాబుకు కేవలం మద్దతు తెలిపాను కానీ డైరెక్ట్‌గా సీఐడీ కార్యాలయానికి వెళ్లి కలుస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. కానీ తనను ఏపీకి రాకుండా అడుగుడుగునా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.

New Update
Pawan Kalyan: ఈరోజు నుంచి రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పందించారు. వైజాగ్ ఘటన నేపథ్యంలో చంద్రబాబు తనకు మద్దతు తెలిపారన్నారు. అలాంటి చంద్రబాబుకు కేవలం మద్దతు తెలిపాను కానీ డైరెక్ట్‌గా సీఐడీ కార్యాలయానికి వెళ్లి కలుస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. కానీ తనను ఏపీకి రాకుండా అడుగుడుగునా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుడు జగన్ లాగా విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తెచ్చుకున్నట్లు.. ఏపీకి రావాలంటే తాము పోలీసుల అనుమతి తీసుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమలాపురం కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా 2వేల మంది కిరాయి రౌడీలను పెట్టి 50 మందిని చంపాలని ప్లాన్ వేసినట్లు కేంద్ర పెద్దలు చెప్పారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దల ఒత్తిడితో వెనక్కి తగ్గారని పవన్ వెల్లడించారు.

సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. జగన్ చట్టాలను చేతిలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. విశాఖ రావొద్దంటావ్.. విమానం ఎక్కొద్దంటావ్.. ఇంత ప్రజాదరణ ఉన్న తనను.. 4దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును ఇలా హింసిస్తుంటే చేతులు కట్టుకుని చూడాలా అని పవన్ ప్రశ్నించారు. దారుణంగా వివేకానందరెడ్డిని చంపిన వాళ్లు బయట తిరుగుతుంటే కోర్టులు ఎక్కడ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి జరిగడం మంచిదేనని.. ప్రజలకు కూడా వైసీపీ ప్రభుత్వం అరాచకాలు తెలుస్తున్నాయన్నారు. ఎవరికి భయపడకుండా ఇక నుంచి రాజకీయ యుద్ధం చేయడమే అని పవన్ పిలుపునిచ్చారు.

మద్యపాన నిషేధం అన్న వ్యక్తి మద్యంపై డబ్బులు సంపాదిస్తే ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. జగన్ చర్యల వల్ల రాష్ట్రం మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే ప్రజలందరూ మేలుకోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటానికే ఇలాంటి దారుణాలు చేస్తున్నారని పవన్ చెప్పారు.

Advertisment
తాజా కథనాలు