నా ఒంటిమీద చేయి పడిందో...ఒక్కొక్కడిని లాక్కొచ్చి మరీ కొడతా: పవన్ కళ్యాణ్ వార్నింగ్..!!

నా ఒంటిమీద చేయి పడిందో...జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ గుండాలను లాక్కొచ్చి మరీ కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు రౌడీలను చూసి ఉంటారు..కానీ విప్లవ పంథాలో ఉన్న రాజకీయ నాయకుడిని మీరు చూసి ఉండరని వ్యాఖ్యానించారు.

New Update
నా ఒంటిమీద చేయి పడిందో...ఒక్కొక్కడిని లాక్కొచ్చి మరీ కొడతా: పవన్ కళ్యాణ్ వార్నింగ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇఛ్చారు. తనపై చేయి పడితే..జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ గుండాలను ఇళ్లలోనుంచి లాక్కొచ్చి మరీ కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయయాత్రలో పవన్ ప్రసంగించారు. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అవసరంలేదన్న ఆయన...తనపై రాయిపడితే తానేంటో చూపిస్తానంటూ హెచ్చరించారు. పాతికేళ్ల యుద్ధానికి సిద్ధపడి తనతో కొట్లాటపడాలన్నారు. వైసీపీ నేతలు పలు ప్రాంతాల నుంచి గుండాలను తీసుకువచ్చి రౌడీయిజానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బాబాయిని చంపుకుని మాకేం తెలియదంటే ఎలాంటి పవన్ మండిపడ్డారు.

PAWAN KALYAN

ఇక వైసీపీ నాయకులు తాను రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారని..తాను రౌడీలకు, గుండాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మీరు రౌడీలను చూసి ఉంటారు కానీ...విప్లవ పంథాలో ఉన్న రాజకీయకుడిని మీరు ఇంత వరకు చూడలేదన్నారు. అంతర్వేదిలో రథం ఘటనను గుర్తు చేసిన ఆయన...అంతర్వేది రథాన్ని వైసీపీ గుండాలే కాల్చేశారని తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు