Janasena Bonaboyina Srinivas Yadav : రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలు చూపిస్తూ సిద్ధం అనే ఫ్లెక్సీలు వేస్తున్నారని అయితే, సిద్ధం అంటే ఎంటని ప్రశ్నించారు గుంటూరు జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. ఉన్న ఉపాధ్యాయులకు సరిగా జీతాలు ఇవ్వట్లేదు కానీ, నాలుగు సంవత్సరాల పది నెలల తర్వాత డీఎస్సీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ అని కామెంట్స్ చేశారు.
Also Read: బడ్జెట్ పేరుతో ఎన్నికల ప్రసంగం..ఆంధ్రకు గుండు సున్నా: సీపీఐ కె. రామకృష్ణ
పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దని విమర్శలు గుప్పించారు. పంచాయతీలో ఉన్న నిధులు దారి మళ్లించాడని ఫైర్ అయ్యారు. రేపటి నుండి పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులతో పని చేపిస్తామని భరోసా కల్పించారు. ప్రజల కోసం పని చేయకుండా రాజకీయ సభలు పేడుతున్నారని మండిపడ్డారు.
Also Read: ముద్దనూరు అల్లర్ల ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ.!
జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎంపై విమర్శలు గుప్పించారు. నువ్వే మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు అన్నావ్..ప్రతి ఇంటికి తిరిగి స్టికర్లు అంటించారు కానీ ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యనించారు. రేపు కోర్టులో కేసులు మొదలుపెడితే ముఖ్యమంత్రి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు యువత కోసమే పవన్ పొత్తుతో ఎన్నికల్లో వెళ్తున్నాడన్నారు. పాలన గాలికి వేదిలేసి 2024 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని దుయ్యబట్టారు. 11 లక్షల కోట్లు అప్పు ఉందని జగన్ అంటున్నాడని అయితే, ఈ డబ్బులు మొత్తం ఎటు మళ్లించాడని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముని కాజేసే పార్టీ ఏదయినా ఉంది అంటే అదే వైసీపీ పార్టీనే నని ధ్వజమెత్తారు.